ఆ చట్టానికి సుప్రీం బాసట..

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టానికి సర్వోన్నత న్యాయస్ధానం మద్దతు పలుకుతూ ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. ఈ చట్టానికి రాజ్యాంగబద్ధత ఉందని స్పష్టం చేసింది. ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు నమోదు చేసే ముందు ప్రాథమిక దర్యాప్తు తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు సోమవారం తేల్చిచెప్పింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు సీనియర్‌ పోలీస్‌ అధికారి అనుమతి అవసరం లేదని, ప్రత్యేక పరిస్ధితుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే అధికారం ఉండేలా చట్ట సవరణలో వెసులుబాటు కల్పించారు. ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేయరాదంటూ దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తడంతో ఆ చట్టానికి కోరలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం సవరణలు ప్రతిపాదించింది.